సౌర కుటుంబం ఆవల ఆవాసయోగ్య గ్రహం!
సౌర కుటుంబానికి వెలుపల సుమారుగా భూమి పరిమాణంలో ఉన్న ఓ ఆవాసయోగ్య గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ‘ఎల్‌పీ791-18 డి’గా దానికి నామకరణం చేశారు.
దిల్లీ: సౌర కుటుంబానికి వెలుపల సుమారుగా భూమి పరిమాణంలో ఉన్న ఓ ఆవాసయోగ్య గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ‘ఎల్‌పీ791-18 డి’గా దానికి నామకరణం చేశారు. భూగోళం నుంచి దాదాపు 90 కాంతి సంవత్సరాల దూరంలోని క్రేటర్ అనే నక్షత్ర మండలంలో.. ఓ ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ గ్రహం పరిభ్రమణం చెందుతోంది. దానిపై క్రియాశీల అగ్నిపర్వతాలు విస్తరించి ఉన్నట్లు అమెరికా పరిశోధకుల బృందం తెలిపింది. భూమితో పోలిస్తే ‘ఎల్‌పీ791-18 డి’ పరిమాణం స్వల్పంగానే ఎక్కువుంటుందని, ద్రవ్యరాశి మాత్రం చాలా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ గ్రహం ఎప్పుడూ ఒకవైపు మాత్రమే నక్షత్రానికి అభిముఖంగా ఉంటుందని వెల్లడించింది. ఫలితంగా ఆ ప్రాంతంలో వేడి మరీ ఎక్కువగా ఉండొచ్చని.. రెండో వైపున పరిస్థితులు జీవం మనుగడకు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్ణీతి’.. లీలా ప్యాలెస్లో వైభవంగా వివాహం