ఉక్రెయిన్‌కు ఎఫ్‌-16లపై ఒత్తిడి!

రష్యాను రెచ్చగొట్టినట్లవుతుందనే కారణంపై ఇంతకాలం ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలను సరఫరా చేయడానికి నిరాకరిస్తూ వచ్చిన అమెరికా ఎట్టకేలకు ఐరోపా దేశాల ఒత్తిడికి అంగీకరించినట్లే కనిపిస్తోంది.

Published : 21 May 2023 04:46 IST

అత్యాధునిక ఆయుధాల సరఫరాకు అమెరికా సమ్మతి?

వాషింగ్టన్‌: రష్యాను రెచ్చగొట్టినట్లవుతుందనే కారణంపై ఇంతకాలం ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలను సరఫరా చేయడానికి నిరాకరిస్తూ వచ్చిన అమెరికా ఎట్టకేలకు ఐరోపా దేశాల ఒత్తిడికి అంగీకరించినట్లే కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు అత్యంత ఆధునాతన ఆయుధాల సరఫరాకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే అవి ఎఫ్‌-16లేనని సమాచారం. జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఆత్యాధునిక ఆయుధాల సరఫరా ఒప్పందం గురించి నేతలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వివరించినట్లు అధికారులు తెలిపారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు.. ఎన్ని ఎఫ్‌-16లను ఉక్రెయిన్‌కు అమెరికా అందించనుందనే వివరాలను వారు పేర్కొనలేదు. ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందని, ఈ ఫైటర్ల సరఫరాకు కొన్ని నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఉక్రెయిన్‌వద్ద పాత సోవియట్‌ కాలపు యుద్ధ విమానాలున్నాయి. అవి ఆధునిక రష్యన్‌ విమానాలను ఎదుర్కోలేకపోతున్నాయి. దీంతో తమకు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పంపాలని జెలెన్‌స్కీ పదేపదే కోరుతున్నారు. మార్చిలో ఇద్దరు ఉక్రెయిన్‌ పైలట్లను అమెరికాకు తీసుకొచ్చి ఎఫ్‌-16లపై శిక్షణ ఇచ్చారు. మరింతమంది పైలట్లను అమెరికాకు తెచ్చే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని