అర డిగ్రీ పెరిగినా.. అనర్థాలే

మండిపోతున్న ఎండలతో భూతాపంపై మళ్లీ చర్చ ఊపందుకుంటోంది. ఉష్ణోగ్రత పెంపుదల 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ 2 డిగ్రీల దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిందేనంటూ ఐక్యరాజ్యసమితి తాజాగా హెచ్చరించింది.

Updated : 22 May 2023 05:13 IST

మండిపోతున్న ఎండలతో భూతాపంపై మళ్లీ చర్చ ఊపందుకుంటోంది. ఉష్ణోగ్రత పెంపుదల 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ 2 డిగ్రీల దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిందేనంటూ ఐక్యరాజ్యసమితి తాజాగా హెచ్చరించింది.

మానవాళి మేధస్సుకు ప్రతీకగా... 1750 తర్వాత మొదలైన పారిశ్రామిక విప్లవంతో ప్రపంచంలో బొగ్గు, చమురు ఇతర శిలాజ ఇంధనాలను మండించడం పెరిగింది. వీటితో పాటు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఆధునిక సౌకర్యాల కారణంగా పర్యావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగాయి. ఫలితంగా వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరగటం ఆరంభమైంది. పారిశ్రామిక విప్లవం నాటితో పోలిస్తే ఇప్పటికి భూతాపం ఒక డిగ్రీ సెంటిగ్రేడ్‌ పెరిగింది. ఈ మాత్రం దానికే అనేక పర్యావరణ దుష్పరిణామాలను ప్రపంచం చవిచూస్తోంది. ద్రువాల్లో మంచు కరుగుతోంది, సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. అతివృష్టి అనావృష్టితో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోకుండా, 1.5 దగ్గరే ఆపాలని ప్రపంచ దేశాలన్నీ కలసి కొన్నేళ్ల కిందట తీర్మానించాయి. అంటే... ఎట్టిపరిస్థితుల్లోనూ పారిశ్రామిక విప్లవం నాటి సగటు ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ దాటకుండా మానవాళి జాగ్రత్త పడాలని 196 దేశాలు ప్రతిన పూనాయి. కానీ ఈసారి ఎండలను చూస్తుంటే మానవాళి సంకల్పం విఫలమయ్యేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2030లోపే ‘1.5 డిగ్రీల సెల్సియస్‌ గీత’ దాటి పోతామేమోననే భయం శాస్త్రవేత్తల్లో కనిపిస్తోంది.

1.5 - 2 మధ్య తేడా అరడిగ్రీయే కదా... దీనికెందుకింత ఆందోళన అని అనిపించొచ్చు. కానీ భూతాపం అరడిగ్రీ పెరిగినా అనర్థాలు అపారం! ఉష్ణోగ్రత 1.5 దాటి 2 డిగ్రీల సెల్సియస్‌కు  పెరిగితే ఏమౌతుందంటే...

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని