27వ సారి ఎవరెస్టు అధిరోహించిన షెర్పా

పాసన్గ్‌ దావా అనే షెర్పా (పర్వతారోహకుల గైడ్‌) 27వ సారి ఎవరెస్టు ఎక్కడం ద్వారా కామి రీటా పేరు మీద ఉన్న రికార్డును సమం చేశారు.

Published : 23 May 2023 05:27 IST

కాఠ్‌మాండూ: పాసన్గ్‌ దావా అనే షెర్పా (పర్వతారోహకుల గైడ్‌) 27వ సారి ఎవరెస్టు ఎక్కడం ద్వారా కామి రీటా పేరు మీద ఉన్న రికార్డును సమం చేశారు. 46 ఏళ్ల పాసన్గ్‌ సోమవారం ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని 27వ సారి అధిరోహించారని ఇమాజిన్‌ నేపాల్‌ ట్రెక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఇదే సీజన్‌లో 28వ సారి ఎవరెస్టును ఎక్కడం ద్వారా నూతన రికార్డును స్థాపించాలని పాసన్గ్‌ ప్రయత్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు