బ్రేవర్‌మన్‌ స్పీడ్‌ డ్రైవింగ్‌ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టబోం

భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోంమంత్రి సువెల్లా బ్రేవర్‌మన్‌ స్పీడ్‌ డ్రైవింగ్‌ వివాదంపై ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు.

Updated : 25 May 2023 04:55 IST

బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ స్పష్టీకరణ

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోంమంత్రి సువెల్లా బ్రేవర్‌మన్‌ స్పీడ్‌ డ్రైవింగ్‌ వివాదంపై ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. ఆమె మంత్రివర్గ నియమావళిని ఉల్లంఘించలేదని, ఈ విషయంలో ఎలాంటి దర్యాప్తు చేపట్టబోమని స్పష్టం చేశారు. గతేడాది స్పీడ్‌ డ్రైవింగ్‌ చేసినందుకుగానూ తనకు పడిన జరిమానాను దాచిపెట్టేందుకు సుయెల్లా ప్రయత్నించారని, ఈ వ్యవహారంలో తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు.. ఆమె రాజకీయ సాయం కోరినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బ్రేవర్‌మన్‌ తీరుపై మండిపడ్డ విపక్షాలు.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండు చేశాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై సునాక్‌ బుధవారం స్పందించారు. ‘‘ఈ వ్యవహారంలో నా స్వతంత్ర నైతిక సలహాదారు సర్‌ లారీ మాగ్నస్‌ను సంప్రదించాను. ఈ విషయంపై దర్యాప్తు అవసరం లేదని ఆయన సూచించారు. దాన్ని నేను అంగీకరించాను. మీ చర్య మంత్రివర్గ నియమావళి ఉల్లంఘనకు సమానం కాదని విశ్వసిస్తున్నాను. మీరు ఈ వ్యవహారానికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇవ్వడంతోపాటు క్షమాపణలు కూడా తెలియజేశారు’’ అని బ్రేవర్‌మన్‌కు రాసిన లేఖలో సునాక్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు