ఇమ్రాన్‌ దంపతులపై దేశం వీడకుండా నిషేధం

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ చుట్టూ రోజుకో కొత్త ఉచ్చు వచ్చి పడుతోంది. తాజాగా ఇమ్రాన్‌, ఆయన భార్య బుష్రా బీబీలు దేశం విడిచి వెళ్లకుండా పాక్‌ ప్రభుత్వం నిషేధం విధించింది.

Published : 26 May 2023 04:19 IST

ఇస్లామాబాద్‌, లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ చుట్టూ రోజుకో కొత్త ఉచ్చు వచ్చి పడుతోంది. తాజాగా ఇమ్రాన్‌, ఆయన భార్య బుష్రా బీబీలు దేశం విడిచి వెళ్లకుండా పాక్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. అంతేకాకుండా ఆయన పార్టీ పీటీఐకి చెందిన 600 మందికి పైగా నేతలపైనా ఇదే తరహా ఆంక్షలను జారీ చేసింది. ఈ మేరకు గురువారం స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నెల 9న ఇమ్రాన్‌ అరెస్టు సందర్భంగా చెలరేగిన హింసాకాండకు సంబంధించి ఇమ్రాన్‌ సహా ఆయన పార్టీకి చెందిన పలువురు నేతలు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని