బ్రిటన్‌ ప్రధాని నివాసం గేటును ఢీకొట్టిన కారు

 బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అధికార నివాసం లండన్‌లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ గేటును గురువారం సాయంత్రం వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది.

Published : 26 May 2023 04:19 IST

ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
ఆ సమయంలో లోపలే ఉన్న రిషి సునాక్‌

లండన్‌:  బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అధికార నివాసం లండన్‌లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ గేటును గురువారం సాయంత్రం వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గేటును కారు ఢీకొన్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ వీధిలో వాహనాల రాకపోకలను నిలిపి వేసి ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని తనిఖీలు చేపట్టారు. అనుమానించాల్సిన పరిస్థితులేమీ లేకపోవడంతో దిగ్బంధనాన్ని తొలగించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధాని రిషి సునాక్‌ తన కార్యాలయంలోనే ఉన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు మరో మార్గం నుంచి ఆయన వెలుపలికి వెళ్లారు. కొద్ది సమయం వరకూ అధికారులెవరూ బయటకు రావద్దని పోలీసులు ఆదేశించారు. ప్రధాని నివాసం ముందు ఎల్లవేళలా గట్టి బందోబస్తు ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లూ అమర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు