రష్యాను వీడిన 500కుపైగా కంపెనీలు

యుద్ధం మొదలైనప్పటి నుంచి 500కుపైగా విదేశీ కంపెనీలు రష్యాను వీడాయి. మరో 500 కంపెనీలు కార్యకలాపాలను నిలిపేశాయి.

Published : 26 May 2023 04:57 IST

ఫ్రాంక్‌ఫర్ట్‌: యుద్ధం మొదలైనప్పటి నుంచి 500కుపైగా విదేశీ కంపెనీలు రష్యాను వీడాయి. మరో 500 కంపెనీలు కార్యకలాపాలను నిలిపేశాయి. ఇంకా 151 కంపెనీలు విస్తరణ ఆలోచనలను మానుకున్నాయి. 175 సమయం కోసం వేచి చూస్తున్నాయి. 230 కంపెనీలు ఎలాగోలా కొనసాగాలని నిర్ణయించుకున్నాయి. యేల్‌ విశ్వవిద్యాలయ లెక్కలు ఈ విషయాలను పేర్కొన్నాయి. చైనా కంపెనీలు పెద్దగా తరలిపోలేదు. జర్మనీ కార్ల సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌, అమెరికా ఫుడ్‌ చైన్‌ సంస్థలు కేఎఫ్‌సీ, మెక్‌ డొనాల్డ్స్‌, ఆస్ట్రియా అటవీ ఉత్పత్తుల సంస్థ మోండి, ఇటలీ ఇంధన ఉత్పత్తి సంస్థ ఎనెల్‌ తదితర కంపెనీలు మూసివేయడమో అమ్మేయడమో చేస్తున్నాయి. అయితే వీటి విక్రయాలకు రష్యా తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రభుత్వానికి 10శాతం పన్ను కట్టడంతోపాటు 50శాతం ధరకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు