నాటో ప్లస్‌లో భారత్‌ను చేర్చుకోవాలి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాకు అధికార పర్యటన జరిపే ముందే ఒక కీలక ప్రతిపాదన వచ్చింది.
అమెరికా కాంగ్రెస్ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదన
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాకు అధికార పర్యటన జరిపే ముందే ఒక కీలక ప్రతిపాదన వచ్చింది. అది- నాటో ప్లస్‌లో భారత్‌ను చేర్చుకోవడం. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభకు చెందిన సెలెక్ట్ కమిటీ ఈ ప్రతిపాదన చేసింది. అమెరికా, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య వ్యూహపరమైన పోటీని పర్యవేక్షించే ఈ కమిటీ.. నాటో ప్లస్‌లో భారత్‌ను చేర్చుకోవాలనీ, తైవాన్‌పై చైనా పన్నాగాలను అడ్డగించాలనీ ప్రతిపాదించింది. రిపబ్లికన్ల చొరవతో ఏర్పాటైన ఈ కమిటీని ‘చైనా కమిటీ’గా పిలుస్తారు. భారత్‌ను నాటో ప్లస్‌లో చేర్చుకోవాలనే ప్రతిపాదనను 2024 జాతీయ రక్షణ ప్రాధికార చట్టంలో చేరుస్తారని ఆశిస్తున్నట్లు రమేశ్ కపూర్ అనే భారతీయ అమెరికన్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాలు నాటో మిత్రదేశాలుగా వ్యవహరిస్తున్నాయి. వీటిని నాటో ప్లస్ 5గా వ్యవహరిస్తున్నారు. భారత్ కూడా కలిస్తే అది నాటో ప్లస్ 6 అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు