నేపాల్‌ నుంచి.. భారత్‌కు విద్యుత్తు సరఫరా

నేపాల్‌లో జల విద్యుదుత్పత్తి పెరగడంతో ఈ ఏడాది కూడా మిగులు నమోదైంది. దీంతో పొరుగుదేశమైన భారత్‌కు కరెంటు సరఫరాను ప్రారంభించింది.

Updated : 28 May 2023 06:17 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో జల విద్యుదుత్పత్తి పెరగడంతో ఈ ఏడాది కూడా మిగులు నమోదైంది. దీంతో పొరుగుదేశమైన భారత్‌కు కరెంటు సరఫరాను ప్రారంభించింది. ఈ మేరకు నేపాల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ అధికార ప్రతినిధి సురేశ్‌ భట్టరాయ్‌ వెల్లడించారు. శనివారం నుంచి భారత్‌కు 600 మెగావాట్ల విద్యుత్‌ విక్రయాలు మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. నేపాల్‌లోని జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో అత్యధిక శాతం.. నదులపై ఆధారపడినవే. సాధారణంగా ఈ దేశంలో శీతాకాలంలో విద్యుత్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండగా.. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. వేసవిలో డిమాండ్‌ తగ్గడంతో పాటు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మిగులు విద్యుత్‌ నమోదవుతుంది. గతేడాది కూడా నేపాల్‌ ఇలాగే జూన్‌ నుంచి నవంబరు వరకు భారత్‌కు జలవిద్యుత్‌ను సరఫరా చేసింది. తద్వారా దాదాపు  రూ.1200 కోట్లను ఆర్జించింది.

భారత్‌ పర్యటనకు నేపాల్‌ ప్రధాని..

నేపాల్‌ ప్రధాని పుష్ప కుమార్‌ దహల్‌ ‘ప్రచండ’ మే 31 నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది డిసెంబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విదేశీ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని