ప్రాణం తీసిన సోషల్‌ మీడియా సవాల్‌

చైనాలో సోషల్‌ మీడియా సవాళ్లు ప్రాణాలు తీసే స్థాయికి చేరాయి.  ఝాంగ్సూ ప్రావిన్సులో ఓ యువకుడు ఇలాంటి సవాలులో భాగంగా చైనీస్‌ వోడ్కాగా పేరున్న బైజ్యూ అనే దేశీయ మద్యం వరుసగా నాలుగు బాటిళ్లు తాగి ప్రాణాలు కోల్పోయాడు.

Published : 29 May 2023 05:32 IST

లైవ్‌లో అతిగా మద్యం తాగి చైనా యువకుడి మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో సోషల్‌ మీడియా సవాళ్లు ప్రాణాలు తీసే స్థాయికి చేరాయి. ఝాంగ్సూ ప్రావిన్సులో ఓ యువకుడు ఇలాంటి సవాలులో భాగంగా చైనీస్‌ వోడ్కాగా పేరున్న బైజ్యూ అనే దేశీయ మద్యం వరుసగా నాలుగు బాటిళ్లు తాగి ప్రాణాలు కోల్పోయాడు. చైనా వెర్షన్‌ టిక్‌టాక్‌ డుయిన్‌లో సాంక్యూయాంజ్‌గా (అసలు పేరు వాంగ్‌) పేరున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ మే 16వ తేదీ తెల్లవారుజామున ‘పీకే’ అనే సవాలులో మరో ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పోటీపడ్డాడు. ఈ పోటీలో విజేతలకు వీక్షకుల నుంచి బహుమతులు, ప్రోత్సాహకాలు అందుతాయి. పరాజితులకు శిక్షలు కూడా ఉంటాయి. పోటీలో ఓడిపోయినందుకు శిక్షగా వాంగ్‌ పలు బాటిళ్ల బైజ్యూను ఎటువంటి విరామం లేకుండా తాగాల్సి వచ్చింది. మధ్యలో కనీసం నీటిని కూడా తీసుకోలేదు. మర్నాడు మధ్యాహ్నానికి అతడు మరణించాడు. చైనా సోషల్‌ మీడియా మార్కెట్లో విపరీతమైన పోటీ కారణంగా వీక్షకులను పెంచుకునేందుకు ఇటువంటి వైపరీత్యాలు అన్ని హద్దులను దాటేస్తున్నాయి. ఈ నెల మొదట్లో ఓ వ్యక్తి ఇంటిపైన చిక్కుకొన్నట్లుగా నటించాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షించగా.. దానిని చిత్రీకరించి ఆన్‌లైనులో పోస్టు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని