విమాన అత్యవసర ద్వారం తెరచిన వ్యక్తి అరెస్టు

గాల్లో ఉండగా.. దక్షిణ కొరియాకు చెందిన ఓ విమానం అత్యవసర ద్వారాన్ని తెరచిన 33 ఏళ్ల లీ అనే వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 29 May 2023 05:23 IST

సియోల్‌: గాల్లో ఉండగా.. దక్షిణ కొరియాకు చెందిన ఓ విమానం అత్యవసర ద్వారాన్ని తెరచిన 33 ఏళ్ల లీ అనే వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం దక్షిణ కొరియాలోని జెజూ ద్వీపం నుంచి డెయగూ నగరానికి 194 మంది ప్రయాణికులతో ఏసియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెళ్తుండగా అందులోని ఓ వ్యక్తి పాక్షికంగా అత్యవసర ద్వారం తెరిచాడు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీనిపై డెయగూ జిల్లా కోర్టు సదరు నిందితుడి అరెస్టుకు తాజాగా వారెంటు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. విమానయాన భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా నిందితుడికి పదేళ్ల వరకు శిక్షపడే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు