కీవ్‌పై భారీగా డ్రోన్ల దాడి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం భారీగా డ్రోన్లతో దాడికి దిగింది. ఇందులో ఒకరు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.

Published : 29 May 2023 05:23 IST

ఒకరి మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం భారీగా డ్రోన్లతో దాడికి దిగింది. ఇందులో ఒకరు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్‌ తయారీ షహీద్‌ డ్రోన్లతో శనివారం రాత్రి జరిగిన ఈ దాడి ఐదు గంటలకుపైగా సాగినట్లు వివరించారు. ఆదివారం కీవ్‌వాసులు తమ నగర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో రష్యా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. గత ఏడాది రష్యా-ఉక్రెయిన్‌ మొదలైనప్పటి నుంచి కీవ్‌పై జరిగిన అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని సైనికాధికారులు తెలిపారు. డ్రోన్‌ శకలాలు నగరంలోని ఏడు అంతస్థుల భవనంపై పడి, మంటలు చెలరేగాయని తెలిపారు. మరోవైపు ఖర్కీవ్‌ ప్రావిన్స్‌లో రష్యా చేపట్టిన శతఘ్ని దాడిలో ఇద్దరు వృద్ధులు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని