పాకిస్థాన్‌లో భూకంపం
పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పశువుల పాక పై కప్పు కూలడంతో ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. అఫ్గానిస్థాన్, తజికిస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతంలో 223 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత 6.0గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే సాయంత్రం 5.57 గంటల ప్రాంతంలో మరోసారి 4.7 తీవ్రతతో భూమి కంపించిందని తెలిపారు. ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు, పెషావర్, స్వాత్, హరిపుర్, మలాకడ్, అబోటాబాద్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని బట్టాగ్రామ్ జిల్లాలో పశువుల పాక పై కప్పు కూలడంతో ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.
పంజాబ్, హరియాణాలోనూ..
భారత్‌లోని పంజాబ్, హరియాణా, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 11.23 గంటలకు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmotsavam: మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి
-
TREI - RB: ‘గురుకుల’ అభ్యర్థులకు నియామక బోర్డు కీలక సూచన
-
Rahul Dravid: వాళ్లెందుకు బౌలింగ్ చేయరంటే.. కారణం చెప్పిన ద్రవిడ్
-
Balakrishna: నా వైపు వేలు చూపుతూ.. రెచ్చగొట్టారు: తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ
-
Cricket World Cup: ముస్తాబవుతోన్న ఉప్పల్ స్టేడియం