న్యూయార్క్‌కు ముంపు ముప్పు!
అగ్రరాజ్యం అమెరికాలో ఖరీదైన కలల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్‌కు ముంపు ముప్పు పొంచి ఉంది. పెరుగుతున్న సముద్ర మట్టం, ఆకాశహర్మ్యాలు, జనాభాతో ఒత్తిడి తీవ్రమై భూమి క్రమక్రమంగా కూరుకుపోతోంది.
వెల్లడించిన తాజా అధ్యయనం
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఖరీదైన కలల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్‌కు ముంపు ముప్పు పొంచి ఉంది. పెరుగుతున్న సముద్ర మట్టం, ఆకాశహర్మ్యాలు, జనాభాతో ఒత్తిడి తీవ్రమై భూమి క్రమక్రమంగా కూరుకుపోతోంది. వీటి ప్రభావంతో న్యూయార్క్ నగరం ఏటా 1 నుంచి 2 మిల్లీమీటర్ల మేరకు ముంపునకు గురవుతోందని తాజా అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. తక్షణమే అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ముంపు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. భూమి ఒత్తిడికి గురయ్యే ప్రాంతాల్లో ఇది సహజ సిద్ధంగా చోటుచేసుకునే ప్రక్రియే అయినా.. న్యూయార్క్ నగరంలో మాత్రం దాని ప్రభావం తీవ్రంగా ఉందని ‘ఎర్త్ ఫ్యూచర్’ జర్నల్ ఈ నెలలో అధ్యయనాన్ని ప్రచురించింది. ఇప్పటికే న్యూయార్క్ నగరంలో 10 లక్షల భవంతులు ఉండగా.. వీటికి వాడిన 1.7 ట్రిలియన్ టన్నుల కాంక్రీట్, ఇతర సామగ్రి ద్వారా ఒత్తిడి పెరిగి భూమి కుంగిపోతోందని ఆ అధ్యయనం పేర్కొంది. న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నేల కుంగిపోతూ నీరు పైకి వస్తోందని, ఏదో ఒక సమయంలో ఈ రెండూ సమాంతరంగా కలిసే ప్రమాదముందని అమెరికా జియోలాజికల్ సర్వేకు చెందిన ప్రముఖ పరిశోధకుడు టామ్ పర్సన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jailer: రజనీకాంత్ ‘జైలర్’ కథను మరోలా చూపించవచ్చు: పరుచూరి విశ్లేషణ
-
Vikarabad: స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది విద్యార్థులు సురక్షితం
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు
-
సముద్ర తీరంలో 144 సెక్షనా?చంద్రబాబు సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా నేతలపై కేసులు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం