పుతిన్‌తో భేటీ అనంతరం ఆస్పత్రికి బెలారస్‌ అధ్యక్షుడు!

బెలారస్‌ అధ్యక్షుడు లుకాషెంకో ఆరోగ్యంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశానంతరం లుకాషెంకోను అత్యవసరంగా మాస్కో ఆస్పత్రికి తరలించారని బెలారస్‌ విపక్ష నేత వేలరి సెప్కాలో తెలిపారు.

Published : 30 May 2023 04:53 IST

పరిస్థితి విషమంగా ఉందంటూ వదంతులు

మాస్కో: బెలారస్‌ అధ్యక్షుడు లుకాషెంకో ఆరోగ్యంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశానంతరం లుకాషెంకోను అత్యవసరంగా మాస్కో ఆస్పత్రికి తరలించారని బెలారస్‌ విపక్ష నేత వేలరి సెప్కాలో తెలిపారు. తమ అధ్యక్షుడి పరిస్థితి విషమంగా ఉందని టెలిగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. విషప్రయోగం జరిగిందన్న అనుమానాన్నీ సెప్కాలో వ్యక్తం చేశారు. ‘‘మాకు లభించిన సమాచారం ప్రకారం.. పుతిన్‌తో భేటీ తర్వాత లుకాషెంకోను అత్యవసరంగా మాస్కో సెంట్రల్‌ క్లినికల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు’’ అని టెలిగ్రామ్‌ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా లుకాషెంకో ఆరోగ్యంపై వార్తలు వస్తున్నాయి. తాను చనిపోలేదంటూ లుకాషెంకో కూడా ఈ వార్తలను ఖండించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని