టిప్పు సుల్తాన్ తుపాకీని దేశం దాటనీయొద్దు
మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ ఎగుమతిపై బ్రిటన్ నిషేధం విధించింది. ఇది దేశం దాటి వెళ్లకూడదని, భారత్-బ్రిటిష్ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఈ అరుదైన, విలువైన (సుమారు రూ.20 లక్షల ఖరీదు) ఆయుధం కీలకమని పేర్కొంది.
ఎగుమతిపై బ్రిటన్ నిషేధం
లండన్: మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ ఎగుమతిపై బ్రిటన్ నిషేధం విధించింది. ఇది దేశం దాటి వెళ్లకూడదని, భారత్-బ్రిటిష్ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఈ అరుదైన, విలువైన (సుమారు రూ.20 లక్షల ఖరీదు) ఆయుధం కీలకమని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లింట్లాక్ స్పోర్టింగ్ గన్ అని పిలిచే ఈ తుపాకీ 1793-94 కాలానికి చెందినది. ఈ సింగిల్ బ్యారెల్ తుపాకీ నుంచి రీలోడింగ్ చేయకుండానే ఒకేసారి సారి రెండు తూటాలు వెలువడతాయి. తయారు చేసిన అసద్ ఖాన్ మహ్మద్ సంతకం కూడా దీనిపై ఉంది. ఇది అప్పటి జనరల్ కార్న్‌వాలిస్‌కు బహుమతిగా వచ్చిందని బ్రిటన్ వర్గాలు చెబుతున్నాయి. టిప్పు సుల్తాన్‌కు చెందిన ఓ కత్తికి ఇటీవల వేలంలో రూ.144 కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KL Rahul: కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్
-
IRCTC tour package: ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..!
-
Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు
-
Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం
-
Kakinada: పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి.. ముగ్గురి మృతి
-
Justin Trudeau: ‘మేం ముందే ఈ విషయాన్ని భారత్‌కు చెప్పాం’: ఆగని ట్రూడో వ్యాఖ్యలు