అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన చైనా తొలి పౌర వ్యోమగామి

చైనా మంగళవారం విజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపింది. వారిలో దేశ తొలి పౌర వ్యోమగామి గుయ్‌ హైచావో కూడా ఉన్నారు.

Published : 31 May 2023 04:03 IST

బీజింగ్‌: చైనా మంగళవారం విజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపింది. వారిలో దేశ తొలి పౌర వ్యోమగామి గుయ్‌ హైచావో కూడా ఉన్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని తమ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ఇది చైనా అంతరిక్ష కార్యక్రమంలో కీలక ముందడుగు. ముగ్గురు వ్యోమగాములు షెంజౌ-16 వ్యోమనౌకలో రోదసిలోకి పయనమయ్యారు. లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ దీన్ని మోసుకెళ్లింది. జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఇది దూసుకెళ్లింది. ప్రయోగించిన 10 నిమిషాల తర్వాత షెంజౌ-16.. రాకెట్‌ నుంచి వేరైంది. నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. ముగ్గురు వ్యోమగాములు ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రయోగం విజయవంతమైందని చైనా మానవసహిత అంతరిక్ష కార్యక్రమ సంస్థ (సీఎంఎస్‌ఏ) పేర్కొంది. కొద్దిగంటల తర్వాత ఈ వ్యోమనౌక.. ‘తియాంగాంగ్‌’ అంతరిక్ష కేంద్రంలోని కోర్‌ మాడ్యూల్‌ ‘తియాన్హే’తో అనుసంధానమైంది. అనంతరం ముగ్గురు వ్యోమగాములు ఆ రోదసి కేంద్రంలోకి ప్రవేశించారు. గత నవంబరు నుంచి అక్కడే ఉంటున్న మరో ముగ్గురు ఆస్ట్రోనాట్‌లను వారు కలుసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని