ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ఖాన్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (70) నాలుగు కేసులకు సంబంధించి లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు మంగళవారం హాజరయ్యారు.

Published : 31 May 2023 04:36 IST

4 కేసుల్లో పూచీకత్తుల సమర్పణ

లాహోర్‌, ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (70) నాలుగు కేసులకు సంబంధించి లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. వీటిలో లాహోర్‌ కోర్‌ కమాండర్‌ ఇంటిపై దాడి సంఘటన కేసు కూడా ఉంది. ఈ కేసులకు సంబంధించి జూన్‌ 2 వరకూ అరెస్టు చేయకుండా ఇచ్చిన బెయిల్‌కు పూచీకత్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘ఏటీసీ లాహోర్‌ న్యాయమూర్తి ఇజాజ్‌ అహ్మద్‌ బట్టర్‌ ముందు ఇమ్రాన్‌ హాజరయ్యారు. ఒక్కో కేసుకు లక్ష పాక్‌ రూపాయల చొప్పున నాలుగు పూచీ కత్తులు సమర్పించారు. ఈ కేసులకు సంబంధించి ఇంతకు ముందే ఆయనకు బెయిల్‌ మంజూరైంది’’ అని కోర్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న సైనిక స్థావరాలు, జాతీయ సంస్థలపై జరిగిన దాడి కుట్రదారుగా ఇమ్రాన్‌ను సైనిక కోర్టులో విచారిస్తారని పాక్‌ హోం మంత్రి రాణా సనావుల్లా మంగళవారం పేర్కొన్నారు.


పాక్‌ ఆరోగ్యమంత్రికి ఇమ్రాన్‌ రూ.1,000 కోట్ల నోటీసు

నకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ పాకిస్థాన్‌ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్‌ ఖాదిర్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలపై ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్రంగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తన గౌరవానికి భంగం కలిగిందంటూ 1000 కోట్ల పాకిస్థాన్‌ రూపాయలకు పరువు నష్టం నోటీసు పంపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని