కొసావోలో హింసాత్మక ఘర్షణలు.. నాటో నుంచి అదనపు బలగాలు

జాతుల పరమైన ఘర్షణలతో ఉత్తర కొసావాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిలో అంతర్జాతీయ శాంతి దళాలకు చెందిన 30 మంది సైనికులు గాయపడ్డారు.

Published : 31 May 2023 04:36 IST

ప్రిస్టినా: జాతుల పరమైన ఘర్షణలతో ఉత్తర కొసావాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిలో అంతర్జాతీయ శాంతి దళాలకు చెందిన 30 మంది సైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరో 700 మంది సైనికుల్ని అక్కడకు పంపించబోతున్నట్లు నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బెర్గ్‌ ప్రకటించారు. కొసావో ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యల్ని తీసుకుంటామని చెప్పారు. ఉద్రిక్తతలు సడలిపోయేలా చేసేందుకు ఇరుపక్షాలూ చర్చలు ప్రారంభించాలని సూచించారు. స్థానిక ఎన్నికలతో కొసావోలో వారం క్రితం గొడవలు మొదలయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు