వర్చువల్‌ విధానంలో షాంఘై సహకార సంస్థ సదస్సు

మన దేశం నేతృత్వం వహిస్తున్న ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జులై 4న వర్చువల్‌ విధానంలో జరగనుంది.

Published : 31 May 2023 04:36 IST

దిల్లీ: మన దేశం నేతృత్వం వహిస్తున్న ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జులై 4న వర్చువల్‌ విధానంలో జరగనుంది. ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ.. దీనికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. సభ్యదేశాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌ నగరంలో నిర్వహించిన ఎస్‌సీవో సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈసారి వర్చువల్‌గా జరిగే సదస్సుకు మోదీ అధ్యక్షత వహిస్తారు. సభ్య దేశాలైన చైనా, రష్యా, కజఖ్‌స్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, పాకిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లను సదస్సుకు ఆహ్వానించారు. పరిశీలక దేశాల హోదాలో ఇరాన్‌, బెలారస్‌, మంగోలియాలను ఆహ్వానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు