ఇమ్మిగ్రేషన్‌ అనుమతుల కోసం.. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో 2 గంటలు నిరీక్షించిన రాహుల్‌

మూడు నగరాల్లో వారంరోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం అమెరికా చేరుకున్నారు.

Published : 31 May 2023 04:36 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: మూడు నగరాల్లో వారంరోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్‌పర్సన్‌ శాం పిట్రోడా, ఇతర సభ్యులు ఆయనకు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇమ్మిగ్రేషన్‌ అనుమతుల కోసం రాహుల్‌ దాదాపు రెండు గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. అదే విమానంలో ఆయనతోపాటు వచ్చిన ఇతర ప్రయాణికులు అక్కడ రాహుల్‌తో స్వీయచిత్రాలు తీసుకున్నారు. క్యూలో ఎందుకు నిల్చొని ఉన్నారని వారిలో కొందరు ఆయన్ని ప్రశ్నించారు. ‘నేనిప్పుడు ఎంపీని కాను. సామాన్యుడిని. దీనిని (ఇలా నిరీక్షించడాన్ని) ఇష్టపడతా’ అని సమాధానమిచ్చారు. రాహుల్‌ తన పర్యటనలో భాగంగా స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముచ్చటిస్తారు. విలేకరుల సమావేశంలో పాల్గొనడంతో పాటు శాసనకర్తలతో, మేధావులతో సమావేశమవుతారు. జూన్‌ 4న న్యూయార్క్‌లో జరిగే బహిరంగ సభతో ఆయన పర్యటన ముగుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు