కంబోడియా రాజుతో మోదీ చర్చలు

భారత్‌లో పర్యటిస్తున్న కంబోడియా రాజు నరోదమ్‌ శిహమోనితో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చలు జరిపారు.

Published : 31 May 2023 04:36 IST

దిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న కంబోడియా రాజు నరోదమ్‌ శిహమోనితో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరిగింది. కంబోడియాతో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్‌ గట్టిగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధం ఉందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కూడా శిహమోనితో భేటీ అయ్యారు. రక్షణ, పార్లమెంటరీ వ్యవహారాల్లో ఇరు దేశాల మధ్య సహకరించుకునే అంశంపై చర్చించారు. అంతకుముందు శిహమోనికి రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదీ ముర్ము లాంఛనంగా ఘన స్వాగతం పలికారు. శిహమోని.. రాజ్‌ఘాట్‌ వెళ్లి, మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని