‘పెను తుపాను’లకు సిద్ధం కండి

చైనా ప్రస్తుతం మరిన్ని సంక్లిష్టమైన భద్రతాపర సవాళ్లను ఎదుర్కొంటోందని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తెలిపారు. ఐరోపా, అమెరికాలతో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎలాంటి దుర్భర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని సూచించారు.

Published : 01 Jun 2023 04:16 IST

 చైనా ప్రజలకు జిన్‌పింగ్‌ సూచన

బీజింగ్‌: చైనా ప్రస్తుతం మరిన్ని సంక్లిష్టమైన భద్రతాపర సవాళ్లను ఎదుర్కొంటోందని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తెలిపారు. ఐరోపా, అమెరికాలతో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎలాంటి దుర్భర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని సూచించారు. బీజింగ్‌లో మంగళవారం జరిగిన జాతీయ భద్రతా కమిషన్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు.‘మనం అత్యంత దుర్భర, అంత్య పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. బలమైన గాలులు, ముంచెత్తే నీళ్లు, ప్రమాదకరమైన తుపానులకు ఎదురొడ్డాల్సి ఉంటుంది. అసలైన పోరాటానికి సిద్ధంగా ఉండాలి’ అని ప్రజలకు సూచించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని