కాన్సులేట్‌లను మూసేయండి.. రష్యాకు జర్మనీ సూచన

తమ దేశంలో ఉన్న 5 కాన్సులేట్‌లలో నాలుగింటిని మూసేయాలని రష్యాకు సూచించామని జర్మనీ వెల్లడించింది.

Updated : 01 Jun 2023 05:05 IST

బెర్లిన్‌: తమ దేశంలో ఉన్న 5 కాన్సులేట్‌లలో నాలుగింటిని మూసేయాలని రష్యాకు సూచించామని జర్మనీ వెల్లడించింది. మాస్కోలోని తమ రాయబార కార్యాలయంలో సిబ్బందిని తగ్గించాలని రష్యా కోరిన నేపథ్యంలో దెబ్బకు దెబ్బలా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. రెండు దేశాల మధ్య సమాన ప్రాతినిధ్యం ప్రాతిపదికన ఈ సూచన చేశామని జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫర్‌ బర్గర్‌ బుధవారం బెర్లిన్‌లో తెలిపారు. జర్మనీలోని బాన్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌, హాంబర్గ్‌, లీప్జిగ్‌, మ్యూనిక్‌లలో రష్యా కాన్సులేట్‌లున్నాయని, వాటిని ఏ నాలుగింటిని మూసేస్తారనేది ఆ దేశం ఇష్టమని పేర్కొన్నారు. ఇటీవలే జర్మనీకి చెందిన 350 మంది సిబ్బందిని మాత్రమే తమ దేశంలో ఉండేందుకు అనుమతిస్తామని రష్యా ప్రకటించింది. దీంతో మాస్కోలోని రాయబార కార్యాలయం, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని కాన్సులేట్‌లనే జర్మనీ కొనసాగించాల్సి ఉంటుంది. మిగిలిన మూడు కాన్సులేట్‌లను నవంబరులోగా మూసేయాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు