అవినీతి కేసులో ఇమ్రాన్‌కు బెయిలు

అల్‌ ఖదిర్‌ ట్రస్టులో రూ.5వేల కోట్ల అవినీతికి బాధ్యుడనే అభియోగాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇస్లామాబాద్‌లోని కోర్టు జూన్‌ 19 వరకు బెయిలు ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

Published : 01 Jun 2023 04:16 IST

ఇస్లామాబాద్‌: అల్‌ ఖదిర్‌ ట్రస్టులో రూ.5వేల కోట్ల అవినీతికి బాధ్యుడనే అభియోగాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇస్లామాబాద్‌లోని కోర్టు జూన్‌ 19 వరకు బెయిలు ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. రూ.5 లక్షల పూచీకత్తు బాండ్లను సమర్పించాలని ఇమ్రాన్‌ను ఆదేశించింది. బుధవారం తొలుత ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇమ్రాన్‌ ముందస్తు బెయిలును మూడురోజులపాటు పొడిగించి అవినీతి వ్యతిరేక కోర్టు నుంచి తదుపరి బెయిలు పొందాలని సూచించింది. ఇమ్రాన్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇంతకు ముందు మే 17 నుంచి మే 31 వరకు బెయిలు ఇచ్చింది. ఇమ్రాన్‌ సతీమణి బుష్రా బీబీ కూడా అల్‌ ఖదిర్‌ ట్రస్టు కేసులో ఇస్లామాబాద్‌లోని కోర్టులో బెయిలు పిటిషన్‌ వేశారు. అయితే, ఆమెపై అరెస్టు వారంట్‌ జారీ కాలేదనీ, ఆమెను అరెస్టు చేయబోవడం లేదని జాతీయ జవాబుదారీ విభాగం కోర్టుకు తెలపడంతో, బుష్రా బెయిలు అర్జీ అనవసరమంటూ కోర్టు కొట్టేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు