విమానం ఎక్కాలా?.. మీ బరువు చూసుకోండి

న్యూజిలాండ్‌ జాతీయ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ విమానాలు ఎక్కే ప్రయాణికులను ముందుగా వ్యక్తిగత బరువు చూసుకోవలసిందిగా కోరుతోంది.

Published : 01 Jun 2023 04:16 IST

సర్వే చేపట్టిన ఎయిర్‌ న్యూజిలాండ్‌

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ జాతీయ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ విమానాలు ఎక్కే ప్రయాణికులను ముందుగా వ్యక్తిగత బరువు చూసుకోవలసిందిగా కోరుతోంది. ఈ వారంలో ప్రారంభమై జులై 2 దాకా కొనసాగే నెల రోజుల సర్వేలో దాదాపు 10 వేల మంది ప్రయాణికుల బరువు వివరాలు సేకరించడం తమ లక్ష్యంగా ప్రకటించింది. పైలట్లు టేకాఫ్‌కు ముందు విమానాల మీద ఉన్న లోడు, బ్యాలెన్సు చేసుకోవాల్సిన తీరుపై మరింత అవగాహన పెంచుకునేందుకు ఈ గణాంకాలు తోడ్పడతాయని తెలిపింది. ప్రయాణికులు బరువు చూసుకునేందుకు ఏర్పాటుచేసే స్కేళ్ల వద్ద బాహ్య ప్రదర్శన ఉండదని, ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి కూడా ఆ వివరాలు తెలియకుండా చూస్తామని ‘ఎయిర్‌ న్యూజిలాండ్‌’ భరోసా కల్పిస్తోంది. ఈ సర్వే ద్వారా విమానంలోకి తరలించే లగేజీ పరిమాణం విషయంలోనూ ఓ స్పష్టత వస్తుందని ఎయిర్‌లైన్స్‌ అధికారి జేమ్స్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని