పాక్‌ జైలులో లష్కరే తోయిబా ఉగ్రవాది మృతి

ముంబయిలో 2008లో దాడి జరిపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన, ఆ ఉగ్రవాద సంస్థకు రెండు పర్యాయాలు చీఫ్‌గా వ్యవహరించిన హఫీజ్‌ అబ్దుల్‌ సలాం భుట్టావి (77) పాకిస్థాన్‌లోని జైలులో గుండెపోటుతో మృతిచెందాడు.

Published : 01 Jun 2023 04:37 IST

లాహోర్‌: ముంబయిలో 2008లో దాడి జరిపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన, ఆ ఉగ్రవాద సంస్థకు రెండు పర్యాయాలు చీఫ్‌గా వ్యవహరించిన హఫీజ్‌ అబ్దుల్‌ సలాం భుట్టావి (77) పాకిస్థాన్‌లోని జైలులో గుండెపోటుతో మృతిచెందాడు. టెర్రర్‌ ఫైనాన్స్‌ కేసులో అరెస్టు అయి దాదాపు మూడేళ్లుగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోని షేకుపుర జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడు మే 29న గుండెపోటుతో మరణించినట్లు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న జమాత్‌-ఉద్‌-దవా ప్రకటించింది. లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం (ఏటీసీ).. టెర్రర్‌ ఫైనాన్స్‌ కేసులో భుట్టావికి 2020లో 16 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉండటం, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు ఆర్థిక వనరులను సమకూర్చడం, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించిన ఐరాస భద్రతా మండలి.. అబ్దుల్‌ సలాం భుట్టావిని 2012లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ముంబయిలో 2008, నవంబరులో జరిగిన దాడిలో 166 మంది మృతిచెందగా ఆరుగురు అమెరికన్లు గాయపడ్డారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు