పసివాళ్లకు పాల బదులు నీళ్లు

సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అక్కడి ప్రజల పాలిట శాపమైంది. అంతర్యుద్ధం కారణంగా లక్షల మంది ప్రజలు వలసబాట పట్టారు.

Published : 02 Jun 2023 03:55 IST

క్షుద్బాధ తాళలేక 60 మంది చిన్నారుల మృతి
సూడాన్‌లో తీవ్ర విషాదం

ఖార్తూమ్‌: సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అక్కడి ప్రజల పాలిట శాపమైంది. అంతర్యుద్ధం కారణంగా లక్షల మంది ప్రజలు వలసబాట పట్టారు. ఈ క్రమంలో రాజధాని ఖార్తూమ్‌లోని ఓ అనాథ శరణాలయంలో వెలుగులోకి వచ్చిన విషయాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. అక్కడి పాలకులు ఆధిపత్య పోరులో పడి పసి ప్రాణాల సంగతే మర్చిపోయారు. అందుకే పాలు పట్టాల్సిన పిల్లలకు నీటిని అందించాల్సిన దుర్భర స్థితి నెలకొంది. దీంతో ఆకలికి తాళలేక, వైద్య సదుపాయం అందక ఆరు వారాల వ్యవధిలో అనాథ శరణాలయంలోని 60 మంది శిశువులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 26 మంది రెండు రోజుల వ్యవధిలోనే చనిపోయారు. మృతి చెందిన చంటిబిడ్డలను ఖననం చేసేందుకు తెల్లటి షీట్లలో చుట్టి ఉంచారు. ఒక గదిలో నేలపై పదుల సంఖ్యలో పసిపిల్లలు ఉన్నారు. వారిలో కొందరు ఏడుస్తూ కనిపించారు. వారి ఆకలి తీర్చేందుకు ఓ మహిళ రెండు జగ్గుల నిండా నీటిని తీసుకెళ్లి తాగించడం కలవరపెడుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని