విద్వేషాల వ్యాప్తికి ప్రసార సమయం ఇవ్వొద్దు

విద్వేషాలు పెంచేవారికి, కుట్రదారులకు, వారి సహాయకులకు ప్రసార సమయం కేటాయించకుండా బహిష్కరించాలంటూ పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్‌ఏ) దేశంలోని శాటిలైట్‌ టీవీ ఛానళ్లను కోరింది.

Published : 02 Jun 2023 04:49 IST

ఇమ్రాన్‌ లక్ష్యంగా పాక్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా నోటిఫికేషన్‌

ఇస్లామాబాద్‌, లాహోర్‌: విద్వేషాలు పెంచేవారికి, కుట్రదారులకు, వారి సహాయకులకు ప్రసార సమయం కేటాయించకుండా బహిష్కరించాలంటూ పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్‌ఏ) దేశంలోని శాటిలైట్‌ టీవీ ఛానళ్లను కోరింది. మే 9న ఇమ్రాన్‌కు మద్దతుగా పాక్‌లో పలుచోట్ల చెలరేగిన హింసాకాండను దృష్టిలో పెట్టుకొని పీఈఎంఆర్‌ఏ బుధవారం ఈ నోటిఫికేషను జారీ చేసింది. ‘‘అప్రమత్తంగా ఉండండి. విద్వేషాలు వ్యాప్తి చేయొద్దు. కుట్రదారులను ప్రోత్సహించవద్దు’’ అని అందులో కోరారు.

ఇమ్రాన్‌ పార్టీ అధ్యక్షుడు ఇలాహీ అరెస్ట్‌

పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు సన్నిహితుడు అయిన చౌదరీ పర్వేజ్‌ ఇలాహీని గురువారం ఆయన ఇంటి బయట అరెస్టు చేశారు. మే 26న లాహోర్‌ జిల్లా కోర్టు ఇలాహీకి వ్యతిరేకంగా నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని