‘అధిక బరువు, నిద్రలేమితో కిమ్‌ అవస్థలు’

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు సంబంధించిన కీలక విషయాలను దక్షిణ కొరియా నిఘాసంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎన్‌ఐఎస్‌) బయటపెట్టింది.

Updated : 02 Jun 2023 05:33 IST

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు సంబంధించిన కీలక విషయాలను దక్షిణ కొరియా నిఘాసంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎన్‌ఐఎస్‌) బయటపెట్టింది. 140 కిలోల మేర విపరీతంగా బరువు పెరిగిన కిమ్‌ తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నారని తెలిపింది. ఆయనకు ఉన్న ఆల్కహాల్‌, నికోటిన్‌ వ్యసనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. ఉత్తర కొరియా అధికారులు కిమ్‌ సమస్యకు చికిత్స కోసం లోతైన వైద్య సమాచారం సేకరించే పనిలో పడ్డట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌ఐసీ ఇచ్చిన సమాచారాన్ని ద.కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్‌ కమిటీ సభ్యుడు యూసాంగ్‌ బూమ్‌ మీడియాతో పంచుకొన్నారు. కిమ్‌ తాజా చిత్రాలను కృత్రిమ మేధతో విశ్లేషించగా.. ఆయన బరువు పెరిగినట్లు గుర్తించామన్నారు. దాదాపు ఇదే సమాచారంతో అమెరికాకు చెందిన ఓ పత్రికలో వెలువడ్డ కథనం కిమ్‌ జోల్పిడెం వంటి ఔషధాలను వాడుతున్నట్లు తెలిపింది.

ఉపగ్రహ ప్రయోగంపై అమెరికా కపట ప్రచారం

తమ సైనిక నిఘా ఉపగ్రహం విఫలమైందంటూ అమెరికా కపట ప్రచారం చేస్తూ ముఠా నాయకుడి పాత్ర పోషిస్తోందని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ వున్‌ సోదరి కిమ్‌యో జోంగ్‌ గురువారం మండిపడ్డారు. త్వరలో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి చూపుతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని