అదనపు అప్పులకు అనుమతి.. చెల్లింపుల సంక్షోభం నుంచి అమెరికాకు ఉపశమనం

ఆర్థిక చెల్లింపుల సంక్షోభం నుంచి అమెరికాకు అతి పెద్ద ఉపశమనం లభించింది. అదనపు అప్పులకు రిపబ్లికన్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Updated : 02 Jun 2023 05:32 IST

వాషింగ్టన్‌: ఆర్థిక చెల్లింపుల సంక్షోభం నుంచి అమెరికాకు అతి పెద్ద ఉపశమనం లభించింది. అదనపు అప్పులకు రిపబ్లికన్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బుధవారం జరిగిన ప్రతినిధుల సభ ఓటింగ్‌లో అప్పుల పరిమితి పెంపు బిల్లుకు అనుకూలంగా 314 ఓట్లు, వ్యతిరేకంగా 117 ఓట్లు వచ్చాయి. అంతకుముందే అధ్యక్షుడు బైడెన్‌, స్పీకర్‌ మెకార్థీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రిపబ్లికన్లు ఓటేశారు. దీంతో ఇక బిల్లు వచ్చేవారం సెనేట్‌కు వెళ్లనుంది. అక్కడ డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో ఆమోదం లాంఛనమే. బిల్లు పూర్తిగా ఆమోదం పొందితే 2025 వరకూ అమెరికా అదనపు అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అమెరికా అప్పుల పరిమితి 31 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. దానిని దాటి అప్పు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని