45 సంచుల్లో మానవ శరీర భాగాలు

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. 45 సంచుల్లో మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.

Published : 03 Jun 2023 06:03 IST

మెక్సికోలో భయానక ఘటన

మెక్సికో సిటీ: ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. 45 సంచుల్లో మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి దర్యాప్తు చేస్తుండగా ఈ దారుణం వెలుగుచూసింది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జాలిస్కో రాష్ట్రంలోని గాడలాజారా సమీపాన ఒక లోయలో ఈ బ్యాగులు బయటపడ్డాయి. అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని అధికారులు తెలిపారు. మే 20న దాదాపు 30 ఏళ్ల వయసున్న ఏడుగురు యువతీయువకులు కనిపించకుండా పోయారు. వారంతా ఒకే కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఆ కాల్‌ సెంటర్‌కు సమీపంలోనే ఈ బ్యాగులు దొరికాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ కాల్‌ సెంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాదకద్రవ్యాలు, రక్తపు మరకలతో ఉన్న వస్తువులను గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆ శరీరభాగాలు ఎవరివనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని