ఆఫీసులో రోజుకు 6 గంటలు మరుగుదొడ్డిలోనే..

 చైనాలో ఓ వ్యక్తి కార్యాలయంలో రోజుకు సుమారు 6 గంటలపాటు మరుగుదొడ్డిలో గడుపుతున్నాడన్న కారణంతో సంస్థ అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించింది.

Published : 03 Jun 2023 05:26 IST

ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థ

బీజింగ్‌:  చైనాలో ఓ వ్యక్తి కార్యాలయంలో రోజుకు సుమారు 6 గంటలపాటు మరుగుదొడ్డిలో గడుపుతున్నాడన్న కారణంతో సంస్థ అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. దీన్ని అతడు కోర్టులో సవాల్‌ చేయగా, ధర్మాసనం సంస్థ చర్యను సమర్థించింది. వాంగ్‌ అనే వ్యక్తి 2015లో మలద్వార సమస్యతో బాధపడ్డాడు. దీనికి చికిత్స కూడా తీసుకున్నాడు. కానీ, సమస్య పూర్తిగా నయం కాలేదని చెబుతూ సుదీర్ఘంగా టాయిలెట్లో గడపడం మొదలుపెట్టాడు. దీంతో సంస్థ అతణ్ని అదే ఏడాది ఉద్యోగం నుంచి తొలగించింది. అతడి వ్యవహార శైలికి సంబంధించిన ఆధారాలను సంస్థ కోర్టుకు సమర్పించింది. అతణ్ని ఉద్యోగంలో కొనసాగించడం కుదరదని వివరించింది. కంపెనీ వివరణతో సంతృప్తి చెందిన కోర్టు ఉద్యోగికి వ్యతిరేకంగా తాజాగా తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని