భద్రతామండలి కూర్పు మారకపోవడం అనైతికం

రెండో ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచంలో కొత్త శక్తిమంతమైన దేశాలు అవతరించినా, వాటికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని దౌత్య ప్రతినిధులు, విధాన సలహాదారులు తప్పుపట్టారు.

Published : 03 Jun 2023 05:26 IST

ఐరాస సమావేశంలో భారత్‌ సహా పలు దేశాల ప్రతినిధుల వ్యాఖ్య

ఐక్యరాజ్యసమితి: రెండో ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచంలో కొత్త శక్తిమంతమైన దేశాలు అవతరించినా, వాటికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని దౌత్య ప్రతినిధులు, విధాన సలహాదారులు తప్పుపట్టారు. భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, సెయింట్‌ విన్సెంట్‌- గ్రెనడైన్స్‌ దేశాల శాశ్వత ప్రతినిధులు భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతపై సమితి ప్రధాన కార్యాలయంలో రౌండ్‌ టేబిల్‌ సమావేశం నిర్వహించారు. తృతీయ ప్రపంచ దేశాల వాణిని వినిపించారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు చాబా కొరోషీ, సమితిలో వివిధ దేశాల రాయబారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భద్రతా మండలి కూర్పు నేటి బహుళ ధ్రువ ప్రపంచాన్ని ప్రతిబింబించడం లేదని సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్‌ అన్నారు. సమకాలీన ప్రపంచంలో కొన్ని దేశాలు శక్తిమంతమైనవిగా అవతరించినా భద్రతా మండలి స్వరూపం మాత్రం మారడం లేదని ఆమె విమర్శించారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, మహమ్మారులు, మానవతా సంక్షోభాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో సమష్టి కృషి అవసరమన్నారు. అన్ని దేశాలు వనరులు, నిపుణులు, దృక్కోణాలను సమీకరించి పరిష్కారాల సాధనకు ఉమ్మడిగా కృషి చేయాలంటే భద్రతా మండలిని సంస్కరించడం అత్యంత ఆవశ్యకమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని