కోర్టు బోనెక్కనున్న బ్రిటన్‌ రాకుమారుడు..

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ కోర్టు బోను ఎక్కనున్నారు. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా ఆయన లండన్‌ హైకోర్టుకు హాజరై బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు.

Published : 03 Jun 2023 06:03 IST

130 ఏళ్లలో తొలిసారి

లండన్‌: బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ కోర్టు బోను ఎక్కనున్నారు. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా ఆయన లండన్‌ హైకోర్టుకు హాజరై బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 130 ఏళ్లలో కోర్టు రూమ్‌లో సాక్ష్యం చెప్పిన బ్రిటన్‌ తొలి రాజకుటుంబీకుడిగా ప్రిన్స్‌ హ్యారీ నిలవనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. బ్రిటన్‌కు చెందిన మిర్రర్‌ గ్రూప్‌.. అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఫోన్‌ హ్యాకింగ్‌ ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్‌ హ్యారీతోపాటు వంద మందికిపైగా ప్రముఖులు ఆ సంస్థపై కోర్టులో దావా వేశారు. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్‌-7 కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. మరో 20ఏళ్ల తర్వాత ఓ పరువునష్టం కేసు విచారణ సమయంలోనూ సాక్ష్యమిచ్చారు. ఈ రెండూ కూడా ఆయన రాజు కాకముందే జరిగాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు