లిబియా నుంచి 9 మంది భారత నావికుల విడుదల

లిబియాలోని స్థానిక మిలీషియా వద్ద కొన్ని నెలల పాటు బందీగా ఉన్న వ్యాపార నౌకకు చెందిన 9 మంది భారత నావికులు విడుదలయ్యారు.

Published : 04 Jun 2023 04:56 IST

దిల్లీ: లిబియాలోని స్థానిక మిలీషియా వద్ద కొన్ని నెలల పాటు బందీగా ఉన్న వ్యాపార నౌకకు చెందిన 9 మంది భారత నావికులు విడుదలయ్యారు. గత బుధవారం విడుదలైన వీరికి లిబియా రాజధాని ట్రిపోలిలో భారత రాయబార అధికారులు స్వాగతం పలికినట్లు తాజాగా తెలిసింది. లిబియా సముద్రతీరంలో తమ నౌక ఎంటీ మాయ-1 విరిగిపోవడంతో అక్కడే చిక్కుకుపోయిన నావికులను మిలీషియా బంధించిందని టునీషియాలో భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందింది. వారిని సురక్షితంగా, సాధ్యమైనంత త్వరగా భారత్‌కు అప్పగించే విషయంలో లిబియా ప్రభుత్వంతో అధికారులు సంప్రదింపులు జరిపారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా లిబియాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపింది. ఎట్టకేలకు వారు లిబియా నుంచి సురక్షితంగా విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని