ఈజిప్టు సరిహద్దుల్లో ఘర్షణ

ఈజిప్టు సరిహద్దుల్లో శనివారం జరిగిన రెండు ఘర్షణల్లో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు, ఓ ఈజిప్టు సైనికుడు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది.

Published : 04 Jun 2023 04:56 IST

ముగ్గురు ఇజ్రాయెల్‌ సైనికుల మృతి

జెరూసలెం: ఈజిప్టు సరిహద్దుల్లో శనివారం జరిగిన రెండు ఘర్షణల్లో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు, ఓ ఈజిప్టు సైనికుడు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. ఈజిప్టు సైన్యం దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి తమ ఇద్దరు సైనికులను కాల్చి చంపాడని తెలిపింది. మరో కాల్పుల ఘటనలో ఓ ఈజిప్టు బోర్డర్‌ సెక్యూరిటీ గార్డుతో పాటు తమ దేశసైనికుడొకరు మృతి చెందారని పేర్కొంది. ఈ విషయాన్ని ఈజిప్టు ధ్రువీకరించింది. మాదకద్రవ్యాల ముఠాను వెంటాడుతూ తమ సైనికుడు ఇజ్రాయెల్‌ సరిహద్దు దాటాడని, ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది. దశాబ్దానికి పైగా ప్రశాంతంగా ఉన్న ఈజిప్టు-ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు