ఏఐ నియంత్రణ సంస్థ ఏర్పాటుకు బ్రిటన్ యోచన
కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఎదురుకాగల ముప్పులను అంచనా వేసి అదుపు చేయడానికి లండన్‌లో కృత్రిమ మేధా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ యోచిస్తున్నట్లు ది టైమ్స్ పత్రిక శనివారం వెల్లడించింది.
లండన్: కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఎదురుకాగల ముప్పులను అంచనా వేసి అదుపు చేయడానికి లండన్‌లో కృత్రిమ మేధా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ యోచిస్తున్నట్లు ది టైమ్స్ పత్రిక శనివారం వెల్లడించింది. దాన్ని వియన్నాలోని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) మాదిరిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. భారత్‌తో సహా 176 దేశాలు 1957లో నెలకొల్పిన ఐఏఈఏ భద్రంగా అణుశక్తి వినియోగానికి ప్రమాణాలను నిర్దేశిస్తోంది. అణుశక్తిని సైనిక ప్రయోజనాలకు వినియోగించకుండా తనిఖీ చేస్తోంది. ఏఐ నిరోధానికి కూడా అటువంటి నియంత్రణ సంస్థను లండన్‌లో స్థాపించడంపై సునాక్ వచ్చేవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కలిసినప్పుడు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఏఐ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటూ దాని వల్ల వచ్చే ప్రమాదాలను నివారించాలని సునాక్ భావిస్తున్నారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) ఇప్పటికే కృత్రిమ మేధా నియంత్రణ చట్టాన్ని ఖరారు చేసే పనిలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..