రుణ పరిమితి పెంపు చట్టంపై బైడెన్ సంతకం
అమెరికా రుణ పరిమితిని ఎత్తివేసే చట్టంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఫలితంగా.. దేశవిదేశాల్లో ఆర్థిక మార్కెట్‌లను అశాంతికి గురిచేసిన నెల రోజుల నాటకానికి తెరదించారు.
వాషింగ్టన్: అమెరికా రుణ పరిమితిని ఎత్తివేసే చట్టంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఫలితంగా.. దేశవిదేశాల్లో ఆర్థిక మార్కెట్‌లను అశాంతికి గురిచేసిన నెల రోజుల నాటకానికి తెరదించారు. డెమోక్రటిక్, రిపబ్లికన్ నాయకుల పరస్పర భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. బైడెన్ ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి అమెరికాలో నగదు కొరత ఏర్పడుతుందని.. అది అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందని అంతకుముందు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. 2021 నాటికి అమెరికా ప్రభుత్వం తీసుకున్న అప్పు.. 28.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికా జీడీపీ కంటే 24 శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించిందే. దాదాపు ఏడు లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ పరిమితిని సైతం దాటి అప్పులు చేసేందుకు.. బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరింది. ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు.. రుణ పరిమితి పెంచేందుకు తొలుత ససేమిరా అన్నారు. దీంతో గత కొంతకాలంగా కాస్త ఆందోళన నెలకొంది. అనంతరం వీరంతా ఓ ఒప్పందానికి వచ్చి.. ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా 314-117 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. 165-46 ఓట్ల తేడాతో డెమోక్రాట్‌లు మద్దతు ఇవ్వగా, 149-71 ఓట్లతో రిపబ్లికన్లు మద్దతు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!