యుద్ధంతో 500 మంది చిన్నారుల మృతి

రష్యా యుద్ధంతో తమ దేశానికి చెందిన సుమారు 500 మందికి పైగా చిన్నారులు మృతి చెందారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆదివారం వెల్లడించారు.

Updated : 05 Jun 2023 06:09 IST

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడి
రష్యా తాజా దాడుల్లో రెండేళ్ల బాలిక దుర్మరణం

కీవ్‌: రష్యా యుద్ధంతో తమ దేశానికి చెందిన సుమారు 500 మందికి పైగా చిన్నారులు మృతి చెందారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆదివారం వెల్లడించారు. ‘‘రష్యా ఆయుధాలు, వారి ద్వేషం.. ప్రతిరోజూ ఉక్రెయిన్‌ చిన్నారుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. వారిలో చాలా మంది గొప్పవారిగా, కళాకారులుగా, క్రీడా ఛాంపియన్లుగా ఉక్రెయిన్‌ చరిత్ర పుటల్లో నిలిచి ఉండేవారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దాడుల కారణంగా ఎంత మంది మరణించారన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేమని, కొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉండడమే దానికి కారణమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రష్యా జరిపిన తాజా దాడుల్లో ఓ రెండేళ్ల బాలిక మృతదేహాన్ని సహాయక సిబ్బంది గుర్తించారు. దినిప్రో నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌ భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆ చిన్నారి భౌతికకాయాన్ని ఆమె తండ్రే రోదిస్తూ వెలికితీయడం అక్కడి వారిని కలచివేసింది. ఆ శిథిలాల నుంచి ఆ వ్యక్తి భార్య కూడా గాయాలతో బయటపడ్డారు. శనివారం నాటి రష్యా దాడిలో అయిదుగురు చిన్నారుల సహా 22 మంది పౌరులు గాయపడ్డారని స్థానిక గవర్నర్‌ సెర్హి లిసాక్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని