అమెరికా యుద్ధనౌకకు అడ్డుపడడాన్ని సమర్థించుకున్న చైనా

తైవాన్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న అమెరికా డిస్ట్రాయిర్‌ నౌక, కెనడా రక్షణ నౌకలకు అడ్డుగా యుద్ధనౌకను పంపడాన్ని చైనా సమర్థించుకుంది.

Published : 05 Jun 2023 04:40 IST

సింగపూర్‌: తైవాన్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న అమెరికా డిస్ట్రాయిర్‌ నౌక, కెనడా రక్షణ నౌకలకు అడ్డుగా యుద్ధనౌకను పంపడాన్ని చైనా సమర్థించుకుంది. సింగపూర్‌లో పలు దేశాల మిలిటరీ అధికారుల సమావేశంలో ఆదివారం చైనా రక్షణ మంత్రి జనరల్‌ లి షంగ్ఫూ మాట్లాడారు. స్వేచ్ఛా నౌకాయానం పేరుతో తైవాన్‌ జలసంధిలో అమెరికా నౌక గస్తీ నిర్వహణ చేపట్టడం చైనాను రెచ్చగొట్టడమేనని వ్యాఖ్యానించారు.

‘‘తైవాన్‌ జలసంధిలో సాధారణ రాకపోకలకు అభ్యంతరం లేదు. కానీ ఈ మార్గంపై ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నాలను మేం తప్పక నిరోధించాలి’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని