అఫ్గాన్‌లో 80 మంది బాలికలపై విషప్రయోగం

అఫ్గానిస్థాన్‌లో దాదాపు 80 మంది బాలికలపై విషప్రయోగం చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది.

Published : 05 Jun 2023 04:40 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో దాదాపు 80 మంది బాలికలపై విషప్రయోగం చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. సర్‌-ఎ-పుల్‌ ప్రావిన్సులోని సంగ్చారక్‌ జిల్లాలో రెండు ప్రాథమిక పాఠశాలల్లో శని, ఆదివారాల్లో ఈ దాడులు జరిగాయి. అందుకు కారణాలేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత కక్షతోనే ఈ దారుణానికి దుండగులు ఒడిగట్టి ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. దాడికి ఎలాంటి విషాన్ని ఉపయోగించారు? చికిత్స పొందుతున్న బాలికల పరిస్థితి ఏంటి? అనే వివరాలు బయటకు రాలేదు. 2021 ఆగస్టులో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అఫ్గాన్‌లో ఇలాంటి దాడులు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని