కృత్రిమ తీపితో మహా చేదైన ఫలితం

కృత్రిమంగా తీపిని ఇచ్చే రసాయనం సుక్రలోజ్‌ మానవ కణాల్లో డీఎన్‌ఏని దెబ్బతీస్తుందని అమెరికాలోని ఉత్తర కరోలినా స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు హెచ్చరించారు.

Published : 06 Jun 2023 03:21 IST

దిల్లీ: కృత్రిమంగా తీపిని ఇచ్చే రసాయనం సుక్రలోజ్‌ మానవ కణాల్లో డీఎన్‌ఏని దెబ్బతీస్తుందని అమెరికాలోని ఉత్తర కరోలినా స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు హెచ్చరించారు. సుక్రలోజ్‌ కలిసిన పానీయాలను సేవించిన తరవాత ఉదరంలో ఉత్పన్నమయ్యే సుక్రలోజ్‌- 6-ఎసిటేట్‌ డీఎన్‌ఏను విచ్ఛిన్నం చేస్తుందని వారు కనుగొన్నారు. ఈ రెండు పదార్థాలు ఉదరం గోడలోని కణజాలాన్ని కూడా పలచబడేట్లు చేస్తాయి. దానివల్ల మలం ద్వారా విసర్జించాల్సిన మలినాల్లో కొన్ని తిరిగి శరీరంలోకి, తద్వారా రక్తంలోకీ ప్రవేశిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు