సామాజిక వ్యవహారశైలి పుట్టింది ఇలా..

సామాజిక వ్యవహారశైలి పుట్టుకొచ్చిన తీరును చైనా శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. దీర్ఘకాలం పాటు అసాధారణ శీతల వాతావరణంలో జీవించడానికి అలవాటుపడే క్రమంలో ఇది అలవడిందని వారు తేల్చారు.

Published : 06 Jun 2023 03:21 IST

వానరాలపై పరిశోధనలో వెల్లడి

దిల్లీ: సామాజిక వ్యవహారశైలి పుట్టుకొచ్చిన తీరును చైనా శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. దీర్ఘకాలం పాటు అసాధారణ శీతల వాతావరణంలో జీవించడానికి అలవాటుపడే క్రమంలో ఇది అలవడిందని వారు తేల్చారు. లంగూర్‌, పొడవైన ముక్కు కలిగిన కోతులను పరిశీలించడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశోధనలో బ్రిటన్‌, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకున్నారు. ఈ వానర జాతులకు సంబంధించిన పర్యావరణ, భౌగోళిక, శిలాజ, వ్యవహారశైలి, జన్యు సంబంధ అంశాలపై విశ్లేషణలు చేపట్టారు. శీతల వాతావరణంలో జీవించే వానరాలు చాలా పెద్ద, మరింత సంక్లిష్ట సమూహాల్లో ఉంటాయని గుర్తించారు. గత 60 లక్షల సంవత్సరాల్లో ఉత్పన్నమైన మంచు యుగాలు.. చలితో ముడిపడిన శక్తి జీవక్రియ, నాడీ-హార్మోనల్‌ నియంత్రణతో ప్రమేయమున్న జన్యువులను ప్రోత్సహిస్తున్నట్లు తేల్చారు. శీతల వాతావరణంలో నివసించే కోతులు.. మరింత సమర్థ హార్మోనల్‌ (డోపామైన్‌, ఆక్సిటోసిన్‌) వ్యవస్థలను వృద్ధి చేసుకుంటున్నట్లు గుర్తించారు. దీనివల్ల పిల్లలపై తల్లులకు సుదీర్ఘకాలం పాటు ప్రేమ ఉండటం, ఎక్కువకాలం పాలివ్వడం, పిల్లల మనుగడ పెరగడం వంటివి సాధ్యమవుతున్నట్లు వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు