తీవ్ర గుండెపోట్లు సోమవారమే ఎక్కువ
తీవ్రస్థాయి గుండెపోట్లు.. సాధారణంగా సోమవారాల్లో సంభవించే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ శాస్త్రవేత్తలు 10,528 మంది రోగుల డేటాను విశ్లేషించి ఈ మేరకు తేల్చారు.
దిల్లీ: తీవ్రస్థాయి గుండెపోట్లు.. సాధారణంగా సోమవారాల్లో సంభవించే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ శాస్త్రవేత్తలు 10,528 మంది రోగుల డేటాను విశ్లేషించి ఈ మేరకు తేల్చారు. వీరంతా 2013 నుంచి 2018 మధ్య తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రుల్లో చేరారు. ఈ రుగ్మతను ఎస్‌టీ- సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫార్కషన్ (స్టెమీ)గా పిలుస్తారు. ప్రధాన రక్తనాళం పూర్తిగా పూడుకుపోవడం వల్ల ఇది తలెత్తుతుంది. వారం ప్రారంభంలో దీని ముప్పు ఎక్కువని గుర్తించారు. దీనికి నిర్దిష్ట కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. తద్వారా ఆ ప్రమాదకర పరిస్థితి గురించి వైద్యులకు మెరుగైన అవగాహన కలుగుతుందని, మరింత ఎక్కువ మంది ప్రాణాలను వారు కాపాడగలుగుతారని పేర్కొన్నారు. తీవ్ర గుండెపోట్లు సోమవారం రావడానికి కారణాలు శరీర జీవగడియారంతో ముడిపడి ఉండొచ్చని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
-
Chandrababu Arrest: ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్‌రెడ్డి
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్