తప్పంతా.. అగ్రరాజ్యాల అభివృద్ధి నమూనాదే
ప్రపంచ పర్యావరణం నాశనం కావడానికి అగ్ర దేశాలు అనుసరించిన అభివృద్ధి నమూనాయే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రకృతిని నాశనం చేసింది వాళ్లే: మోదీ
దిల్లీ: ప్రపంచ పర్యావరణం నాశనం కావడానికి అగ్ర దేశాలు అనుసరించిన అభివృద్ధి నమూనాయే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘ముందు మా దేశం అభివృద్ధి చెందాలి. తర్వాతే పర్యావరణం అన్న ఆలోచనతో అగ్రదేశాలు విధాన నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో వారి అభివృద్ధి లక్ష్యాలైతే నెరవేరాయి. ప్రపంచ పర్యావరణం మాత్రం నాశనమైంది. ఇందుకు పేద, వర్ధమాన దేశాలు మూల్యం చెల్లిస్తున్నాయి. దీన్ని దశాబ్దాలుగా ఎవరూ ప్రశ్నించలేదు. అభ్యంతర పెట్టలేదు. భారత్ మాత్రమే ఈ వాతావరణ న్యాయం గురించి అభివృద్ధి దేశాలను ప్రశ్నించింది’’ అని ప్రధాని తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రగతికి భారత్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ప్రకృతి రక్షణకూ అంతే విలువిస్తోందని అన్నారు. గత 9 సంవత్సరాల్లో హరిత, స్వచ్ఛ ఇంధనంపై భారత్ దృష్టి పెట్టిందని తెలిపారు. కరోనా సమయంలో భారత్ మిషన్ హైడ్రోజన్ ప్రారంభించిందని గుర్తు చేశారు. మట్టి, నీరును రసాయనాల నుంచి కాపాడుకోవడానికి ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Gautham Menon: ‘లియో’.. మైండ్ బ్లోయింగ్ మూవీ: గౌతమ్ మేనన్
-
glasgow: ఖలిస్థానీల తీరును ఖండించిన గ్లాస్గో గురుద్వారా..!
-
GPS Spoofing: దారి తప్పుతున్న విమానాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?