పారిపోతున్న రష్యా సైన్యం!

బఖ్‌ముత్‌లో రష్యా సైన్యానికి భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయా..! ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఉక్రెయిన్‌కు కోల్పోతోందా..! అవుననే అంటోంది ఆ నగరం రష్యా కైవసం కావడంలో కీలక పాత్ర పోషించిన వాగ్నర్‌ కిరాయిసేన.

Published : 06 Jun 2023 04:25 IST

బఖ్‌ముత్‌లో ఉక్రెయిన్‌ ఎదురుదాడులు

కీవ్‌: బఖ్‌ముత్‌లో రష్యా సైన్యానికి భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయా..! ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఉక్రెయిన్‌కు కోల్పోతోందా..! అవుననే అంటోంది ఆ నగరం రష్యా కైవసం కావడంలో కీలక పాత్ర పోషించిన వాగ్నర్‌ కిరాయిసేన. ‘‘బఖ్‌ముత్‌ ఉత్తరాన ఉన్న బెరికీవ్కా ప్రాంతంలో చాలా వరకు కోల్పోయాం. చడీచప్పుడు లేకుండా మా దళాలు పారిపోతున్నాయి. ఇది సిగ్గుచేటు’’ అని వాగ్నర్‌ ముఠా అధినేత ప్రిగోజిన్‌ పేర్కొన్నారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, సైన్యాధిపతి... దళాలను ముందుండి నడిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు డొనెట్స్క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ భారీ సైనికదాడిని తిప్పికొట్టామని రష్యా పేర్కొంది. కీవ్‌ ఖండించింది. బఖ్‌ముత్‌వైపు ఎదురవుతున్న ఓటముల నుంచి దృష్టిని మళ్లించడానికి ఇలాంటి సమాచారాన్ని రష్యా విడుదల చేసిందని ఆరోపించింది. కీలకమైన ప్రాంతాలను ఆక్రమించామని, శత్రువు ఆత్మరక్షణలో పడిందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని