సురినాంతో 4 ఒప్పందాలు

సురినాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం రాజధాని పరమరిబోలో ఆ దేశాధ్యక్షుడు చంద్రికా ప్రసాద్‌ సంతోకీతో సమావేశమయ్యారు.

Published : 06 Jun 2023 04:55 IST

 రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన

పరమరిబో: సురినాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం రాజధాని పరమరిబోలో ఆ దేశాధ్యక్షుడు చంద్రికా ప్రసాద్‌ సంతోకీతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య రక్షణ, ఐటీ రంగాల్లో మరింత సహకారంపై చర్చలు జరిపారు. ఆరోగ్య, వ్యవసాయ తదితర రంగాలపై నాలుగు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం ముర్ము సురినాం చేరుకున్నారు. భారతీయులు తొలిసారి సురినాం వచ్చి 150 ఏళ్లయిన సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన స్టాంపును ముర్ము అందుకున్నారు. అత్యవసర మందులకు సంబంధించిన పెట్టెను సంతోకీకి ముర్ము అందజేశారు. 452 మంది భారతీయ కార్మికులతో కూడిన నౌక 1873 జూన్‌ 5వ తేదీన సురినాం రాజధాని పరమరిబో చేరుకుంది. అందులో ఎక్కువ మంది తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లకు చెందినవారు. సురినాంలో తొలుత అడుగుపెట్టిన మయి, బాబా అనే స్త్రీ, పురుషుల స్మారకానికి ముర్ము నివాళులర్పించారు. జీవితాలను త్యాగం చేసిన 34వేల మందిని స్మరించుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు