కాలుష్య కారక వంటచెరకునే వినియోగిస్తున్న 230 కోట్ల మంది

ఆధునిక ప్రపంచంలో ఇప్పటికీ 230 కోట్ల మంది వంట కోసం కాలుష్య కారక వంట చెరకుపైనే ఆధారపడుతున్నారు. మరోపక్క 67.5 కోట్ల మందికి విద్యుత్‌ సౌకర్యమే లేదు.

Published : 07 Jun 2023 04:04 IST

ప్రపంచంలో 67.5 కోట్ల మందికి విద్యుత్‌ సౌకర్య లేమి

ఐక్యరాజ్య సమితి: ఆధునిక ప్రపంచంలో ఇప్పటికీ 230 కోట్ల మంది వంట కోసం కాలుష్య కారక వంట చెరకుపైనే ఆధారపడుతున్నారు. మరోపక్క 67.5 కోట్ల మందికి విద్యుత్‌ సౌకర్యమే లేదు. ఈ మేరకు అయిదు అంతర్జాతీయ సంస్థలు సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల మేరకు 2030 నాటికి 6.60 కోట్ల మంది విద్యుత్‌ సౌకర్యం లేకుండానే ఉంటారని, అలాగే 190 కోట్ల మంది స్వచ్ఛ వంట ఇంధన అవకాశాలు లేకుండానే ఉంటారని వివరించింది. వాస్తవానికి 2015 నాటికి ప్రపంచంలో అందరికీ సరసమైన ధరలో, సుస్థిరమైన, ఆధునిక ఇంధనం అందుబాటులోకి రావాలన్నది ఐక్యరాజ్యసమితి లక్ష్యం కావడం గమనార్హం. అంతర్జాతీయ ఇంధన సంస్థ, అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. ఐరాస లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రపంచ దేశాలు సరైన దిశలో ముందుకుసాగడంలేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని